|
జయమణి ప్రొఫైల్
భక్తిభావభరితం జయమణిగాత్రం
కర్ణాటక సంగీతంలో సాహిత్య స్పష్టత, భక్తి భావ స్పూర్తి అనే ప్రధాన లక్షణాలుంటేనే, ఆ గానం రాణిస్తుంది. సంగీత జ్నానము భక్తి వినా సన్మార్గము కలదే అని త్యాగరాజస్వామి సందేశానికి సార్థకత లభిస్తుంది. శ్రీమతి జయమణి నరసింహన్ గానంలో ఈ ప్రముఖమైన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. భర్త సుదీర్ఘ అనారోగ్యం కారణంగా, వారి సపర్యలోనే ఆమె సమయమంతా వినియోగిస్తూ, కచేరీలు సోంతంగానూ, రేడియో ప్రోగ్రాములు కూడా ఎక్కువగానూ పాల్గొనలేఖ తమ ఆసాక్తతను తెలియజేస్తుండేవారు. కాని ఆమె గాత్ర గాంభీర్యం, ఆమె క్రుతి జ్నాన సంపద ఆమెను ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉన్నాయి.
ఇప్పటికీ ఆమె పాడారంటే, ఆమె గానంలో మమైక్యం చెందడం, భక్తిభావంలో ఆమె మనసు లగ్నం కావడం శ్రోతలకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. జయమణి 1942లో తిరుపతిలో జన్మించారు. తెలుగు, తమిళ భాషలలో చక్కని పరిచయం కలవారు. తన తల్లీ శ్రీ లక్ష్మీ వద్ద చిన్నతనంలోనే సంగీతం నేర్చుకున్నారు. ఆమె పదవఏటనే కర్నాటక సంగీతంలో పాటలు పాడేవారు. తల్లి మహా విద్వాంసురాలు కావడానికి అన్ని అర్హతలూ సంపాదించుకున్నారు.
పైగా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజీ నుంచి ఎం.ఎ., బి.ఇడి., పట్టా పొందారు. చిన్నప్పట్నుంచి ఎన్నో సంగీత పోటీల్లో లెక్కకు మిక్కిలిగా బహుమతులందుకున్నారు. భర్త కె.సి. నరసింహన్ తో విహాహమైన తరువాత, దేశంలో పలు ప్రాంతాలలో నివసించిన కాలంలో, జయమణి దేశవ్యాప్తంగా కచేరీలు చేసి, కీర్తి పొందినవారు. భర్త తమిళనాడు కేరైక్కుడిలో సెంట్రల్ ఎలక్ట్రో కెమిస్ట్రీ ఇన్ స్టిట్యూట్ లో డిప్యూటి డైరెక్టర్ గా ఉన్నతోద్యోగ బాధ్యతలు నిర్వహించేవారు. వారి వ్రుత్తి రీత్యా సాంకేతిక విజ్యాన సంబంధమైన పనులలో తలమునకలై ఉన్నా, సంగీతంపట్ల, భర్త జయమణి గాన కౌశలం పట్ల ఎంతో అవగాహన, గౌరవం కలిగి ఉండేవారు.
జయమణి తాను పెద్ద చదువు చదివిన విదూషీమణి కావటమే కాక, సంగీతంలో సైతం ఉన్నతస్థాయి నందుకుని, ఎన్నో పురస్కారాలు పొంది, తిరుపతిలో జరిగే ప్రతి బ్రహ్మోత్సవాలలోనూ అరియక్కుడి రామానుజయ్యంగార్, మైసూర్ చౌడయ్య వంటి దిగ్దంతుల సన్నిధిలో పాడమని పెద్దలు ప్రోత్సహించినప్పుడు, కేవలం పది సంవత్సరాల వయసు నుండీ కూడా ధైర్యం తెచ్చుకుని పాడి, మెప్పుతోపాటు బహుమతులు కూడా అందుకున్నారు పెద్దయినాక కూడా, బాలాంత్రపు రజనీకాంతరావు గారి వద్దనూ, తిరుపతి ఎస్వీ మ్యూజిక్ కాలేజిలో ఎమ్మెస్ బాలసుబ్రహ్మణ్య శర్మగారి వద్దనూ, అన్నమయ్య కీర్తనలను నేర్చుకున్నానని, రజని గారు ఆ పాటలకు అర్థాలు, వ్యాఖ్యానం చెబుతున్నప్పుడు తాను ముగ్దురాలై వినేదాన్నని ఆమె అంటారు.
అఖిల భారత యూత్ ఫెస్టివల్ లో, తనకు సంగీతంలో ప్రథమ బహుమతి వచ్చినప్పుడు, మరో రెండు పర్యాయాలు అఖిల భారత స్థాయి బహుమతులు వచ్చినప్పుడు గాని, సంగీతం మనలో భక్తీ భావాన్ని సహ్రుదయతను, సత్ప్రవర్తనను పెంచడానికి సాధనాలుగా ఉపయోగించుకోవాలి గాని, ఐహిక సంపదలను పెంచుకోవడానికి కాదని తాను తీర్మానించుకుని, సంగీత విద్యను మరే విధంగాను భావించలేదని ఆమె చెప్పడం సంగీతంపై ఆమెకు ఉన్న గౌరవభావం ఎటువంటిదో మనకు అవగతం అవుతుంది.
'అవ్వయ్యార్' సినిమాలో జయమణి చిన్నవయసులో ఉన్నప్పుడు ప్లేబ్యాక్ లో ఒక పాట పాడారు. అది ఆమె జీవితంలో ఒక మైలురాయి. అక్కడ నుంచి, తల్లి శ్రీ లక్ష్మి వేసిన సంగీత పునాదిపై, ఆమె తన సంగీత సౌధం నిర్మించికున్నారు. రాజం అయ్యర్, గోటు వాద్య నిపుణులు నారాయణయ్యర్ వంటి దిగ్గంతుల వద్ద సంగీతంలో తనకు తెలియని కొత్త విషయాలు నేర్చుకుని, ఆ విద్యను నిస్వార్థ సేవలో ఉపయోగించారు జయమణి. భర్త ఆవసాన దశలో అమిత దు~:ఖంలో మునిగి ఉన్న తనను ఆయన పిలిచి ఒక్కసారి త్యాగరాజస్వామి క్రుతి 'మోక్షము కలదా' పాడనున్నారట. అంతటి దు~:ఖాన్ని ఎలాగో దిగమింగుకుని, తానా పాటను పాడారు. భక్తి పారవశ్యంలో మూసి ఉన్న తన కళ్ళు తెరిచెటప్పటికే భర్త కన్నుమూశారు.
'మోక్షము కలదా, భువిలో జీవన్ముక్తులు కానివారలకు' అని త్యాగరాజు రాసినట్లుగానే తన భర్త, ముందు జీవన్ముక్తి పొంది అనంతరమేఈ దేహం చాలించారని ఆమెకు నమ్మకం కలిగిందట. అదే ఆమె వైరాగ్య మనస్తత్వానికి దోవ తీసింది. ఈ మధ్య సద్గురు శివానందమూర్తి గారి పాదపూజా సమయంలో జయమణి తాను అస్వస్థురాలై ఉండీ, మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ చేరువలో ఉన్న సమయంలో, భక్తి పారవశ్యతతో కళ్లు అశ్రుపూరితాలై ఉన్న సమయంలో, ఒక పట్టుదలతో రెండంతస్తుల మెట్లు ఎక్కి తన కచేరీలో కేవలం భక్తిసంగీతం, అందులో అన్ని గురుస్తుతి సంకీర్తనలూ, త్యాగరాజ క్రుతులూ, శ్లోకాలూ, మాత్రమే ఉన్నటువంటి, సంగీతాన్ని తన్మయత్వంతో పాడినప్పుడు సద్గురువులు ఆశీర్వదిస్తూ, ఆమెను మీరు భీయునిపట్నం వచ్చి ఆశ్రమంలో పాడాలి' అన్నారు.
అది తనకు మనో బలాన్ని ప్రసాదించింది అంటారామె. 'ఈ కాళ్లతో ఎలా రాను?' అని అడిగితే 'పాడేది మీ గాత్రమే కాని, మీ కాళ్లు కాదు గదా!" అని గురువుగారు నవ్వుతూ అన్నప్పుడు, ఆమె కళ్ళు చెమర్చాయట. జ్నానమొసగరాదా' అనే పూర్వి కళ్యాణి రాగ క్రుతి 'గురు లేక ఎటువంటి గుణికి' అనే, గౌరి మనోహరి రాగ క్రితి పాడినప్పుడు, జయమణికి తనకు తెలియకుండానే, గురుసన్నిధి ఉన్న కారణంగా, ఆ క్రుతులలోని పరమర్థం స్వయం వ్యక్తమైందంటారు. ఇప్పరికీ శ్రీమతి జయమణి ఇంటివద్ద చిన్నపిల్లలను చేరదీసి సంగీతం నేర్పుతుంటారు. అది నా జీవిత గమ్యం అంటారామె.
|