|
వ్యక్తిత్వాలను తెలిపే చాక్లెట్లు
చాక్లెట్లు తిననివారు ఉండకపోవచ్చు. తియ్యనైన, నోటిలో వేసుకుంటే కరిగిపోయే చాక్లెట్లు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఇష్టమే. అలాంటి చాక్లెట్లు మనిషి వ్యక్తిత్వాన్ని తెలిపే గుణాలను కలిగి ఉన్నాయట. కొన్ని రకాల రంగుల్లో లభించే చాక్లెట్ల విశేషాలు ఇవే. చాక్లెట్ ప్లేవర్ ను ఇష్టపడేవారు డ్రమెటిక్ గా, ఉత్సాహంగా, స్రుజనాత్మకతను కలిగి ఉంటారట. కొత్త కొత్త ఆలోచనలతో రోజును ప్రారంభిస్తారట.
ప్రతి పనిని ఎంతో శ్రద్ధతో చేస్తారు. స్ట్రాబెరీ ప్లేవర్ ను ఇష్టపడేవారు మంచి మాటకారులు కష్టాన్ని నమ్ముకుంటారు. వారి ఛలోక్తులతో ఇతరులకు దగ్గరవుతారు. ఏ పనైనా ఎంతో వివరణ తెలిసి, ఏ పనిపై ఆసక్తి ఉంటేగాని చేయరు. అందరిలో ప్రత్యేకంగా కనిపించటానికి ఇష్టపడుతారు.
కాఫీ ప్లేవర్ ను ఇష్టపడే వ్యక్తులు సర్వదా ఆందోళనతో కనిపిస్తుంటారట. డ్రమెటిక్ గా ఉత్సాహవంతులైనా, మంచి యుక్తిని కూడా కలిగి ఉంటారు. ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించగలరు. అధికమైన పని ఒత్తిడి వలన వీరు బాధపడుతుంటారు.
|