|
నగలు ధరించని మహిళలు!
ఈ వార్త చూసిన వెంటనే మీకు నమ్మశక్యంగా కనిపించడం లేదు కదూ!. అందునా మహిళలు నగలు ధరించకపోవడం అనే విషయం నిజంగా ఓ వార్తే నేటి కాలంలో నగరాల్లోనే కాకుండా గ్రామీణ యువతులు కూడ నగలు ధరించటాన్ని ఫ్యాషన్ గా అలవాటు పడ్డారు. అలాంటి ప్రపంచంలో నగలు వైపు కన్నెత్తి చూడని కన్నెపిల్లలు ఉన్నారంటే ఆశ్చర్యమే కదూ! తమిళనాడులోని కరుక్కాపట్టి గ్రామంలో మహిళలు ఆభరణాలవైపు కన్నెత్తి చూడరట. .
ముక్కుపుడక, చెవికమ్మెలు, మెడలో హారాలు, చేతులకు గాజులు ఇలాంటివేవి అస్సలు ధరించరు. అంతేకాదు ముఖానికి పౌడర్ కూడా రాసుకోరు. గతంలో అందగతై అయిన భార్య ఉన్న ఓ యువకుడు చేతులకు గాజులు, కమ్మలు, ముక్కుపుడకతో ఉన్న మరో అమ్మాయిని చూసి మోజుపడ్డాడట. ఆమె ఇంటివారికి అతనికి మధ్య జరిగిన ఘర్షణలో అతను మరణించాడు. వారిద్దరూ కూడా అతనితోపాటే సహగమనం చేశారట. దాంతో ఆ ఊరి అమ్మాయిలు ఎవరూ నగలు ధరించకుండా కట్టడి చేశారట వారి కుల పెద్ద. దాంతో అక్కడ నివసించే అమ్మాయిలు నగలు ధరించటానికి ఇష్టపడటం లేదు.
|