|
వండర్ న్యూస్ .
పోస్టర్లే కనిపించని ఊరు!
నగరాల్లోను, పట్టణాల్లో నివసించేవారు తమ గోడలు పొస్టర్లతో నాశనమవుతోందని వాపోతుంటారు. తమ గోడలు నాశనం కాకుండా ఉండటానికి వారు స్టిక్ నో బిల్స్ అని ప్రింట్ చేసి అతికించినా మరుసటిరోజు ఉదయాన్నే వారికి దాని కిందనో పక్కనే పోస్టర్లు అంటించి కనిపిస్తుంది. అలా పోస్టర్లతో విసుగెత్తిన ఇంటియజమానులకు ఈ వార్త నిజంగా సంతోషాన్ని కలిగిస్తుంది. .
ఒక్క పోస్టర్ కూడా కనిపించని ఊరు ఒకటుందంటే చాలామంది నమ్మకపోవచ్చు. కాని ఇది నిజం. పోస్టర్లే లేని ఊరు ఒకటి ఉంది. అది కూడా తమిళనాడులో, ఒత్లై వీడు అనే ఈ ఊరిలో మన నగరంలాగా ఏ వైపు చూసినా, గోడలకు అట్టల్లా అంటించిన పోస్టర్లు అనేవి కనిపించవు. ఈ ఊరిని గురించి తెలిసిన రాజకీయనాయకులు, పార్టీలు ప్రశాంతంగా వచ్చి తమకు ఓట్లు వేయమని అర్థించి వెళ్ళటమే తప్ప ఏ గోడ మీద పోస్టర్లు అంటించమనో, లేదా రాతలు రాయమనో తమ అనుయూయులకు చెప్పరట. వాటివల్ల ఊరి జనంలో ఉన్న ఐకమత్యం నాశనమవుతుందన్న ఉద్దేశ్యంతో వారు కూడా పోస్టర్ల జోలికెళ్ళరు.
|