More
More Videos Advt...

పెరిగిన రూపాయి మారకంతో నష్టపోతున్న బిపిఓ కంపెనీలు

హైదరాబాద్, అక్టొబర్ 16 ~: డాలర్ విలువ ఇప్పుడు రూపాయి మారకంతో పోల్చుకుంటే బాగా తగ్గిపోవడంతో ఎగుమతులపై ఆధారపడ్డ కంపెనీలు ఇప్పుడు నష్టాలను చవిచూస్తున్నాయి. రూపాయి బలం తమను నష్టాలపాలు చేస్తోందని వారు వాపోతున్నారు. ముఖ్యంగా బిపివో రంగంపై దీ ని ప్రభావం ఎక్కువగా ఊంది. ఇతర దేశాలలోని కంపెనీలకు సేవలు అందించడం ద్వారా డాలర్ల రూపంలో అవి ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. అయితే, అమెరికా డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలువ ఇటీవలికాలంలో రూ. 41 నుంచి 39కి పడిపోయింది. దీంతో డాలర్ల రుపేణా వచ్చే సంపాదనకు రెండు రూపాయల మేరకు. అదే మిలియన్లలో పోల్చుకుంటే అధికమొత్తంలో ఆదాయానికి గండిపడుతోంది. దీంతో విదేశాల్లోనే ఎక్కువ కేంద్రాలను ప్రారంభించేందుకు ఈ కంపెనీలు ప్రణాళికలను సిద్ధం చేసుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. దేశీయ మార్కెట్ లో రూపాయి బలాన్ని తట్టుకునేందుకు వీలుగా దేశీయంగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని అవి భావిస్తున్నాయి. దేశ ఆర్థికాభివ్రుద్ధితో పాటు రూపాయి మారకపు విలువ కూడా పెరుగుతోంది. రూపాయి విలువ ఒక్క శాతం పెరిగితే ఐ.టి. కంపెనీలపై 20 బేసిస్ పాయింట్ల మేరకు ప్రభావం చూపుతుంది. అదే బిపిఓ కంపెనీలపై అయితే 50 పాయింట్లవరకు ఊంటుందని నిపుణులు అంటున్నారు. కొద్దికాలంగా రూపాయి విలువ 11 నుంచి 12 శాతం పెరిగింది. ఒక్కశాతం పెరిగితేనే నష్టమనే ఐ.టి., బి.పి.ఓ కంపెనీలు ఇంత భారీ స్థాయిలో రూపాయి విలువ పెరగడాన్ని చూసి తమ లాభం తగ్గిందని వాపోతున్నారు. అంతేకాకుండా రూపాయి మరింత పుంజుకోకుండా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.