|
స్టాక్ మార్కెట్ పరుగు ఎందాక?
హైదరాబాద్, అక్టొబర్ 17 ~: మనదేశంలో ఆర్థిక సంస్కరణలు భారీ పెట్టుబడిదారులకు ఏంత మేలు చేస్తున్నాయో అప్రతిహాతంగా పెరుగుతున్న స్టాక్ మార్కెట్ గ్రాఫ్ ను చూస్తే తెలుస్తుంది. ఒక్కరోజులోనే పెట్టుబడిదారుల సంపదలకు రెండు లక్షల కోట్ల రూపాయలు తోడయ్యాయంటే మార్కెట్ జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాని ఎవరూ ఊహించని విధంగ స్టాక్ మార్కెట్ పరుగులు తీస్తోతి. నాలుగు రోజుల వ్యాపార వ్యవధిలోనే 18వేల పాయింట్ల నుంచి ప్రామాణిక సూచిక సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు పెరిగి రికార్డు స్రుష్టించింది. .
మధ్యంతర ఎన్నికలు లేవని వచ్చిన వార్తలు మదుపరులను మరింతగా కొనుగోలు చేసేలా చేసింది. బాంబే స్టాక్ ఎక్సేంజిలో ఒకేరోజున అన్ని రకాల సూచీలు ఒకేరీతిన పెరగడం విశేషం. ఈ జోరు భారత్ కే పరిమితం కాలేదు. ఆసియాలోని అన్ని మార్కెట్లలోను ఈ జోరు కనిపిస్తోంది. విదేశీ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున డాలర్లను మార్కెట్ లో కుమ్మరిస్తూ పోతున్నారు. .
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విదేశీ పెట్టుబడిదారులు ఇప్పటివరకు దాదాపు 30వేల కోట్ల రూపాయలను భారత మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టారని పరిశీలకులు అంటున్నారు.
|