|
స్టాక్ మార్కెట్ లో ఎఫ్ ఐఐ లదే హవా...!
హైదరాబాద్, అక్టోబర్ 18 ~: మన స్టాక్ మార్కెట్ ఇపుడు ఫండమెంటల్స్ కన్న ఎఫ్ ఐఐలదే హవా అని తెలుస్తోంది. నిన్నటి వరకు అందరూ స్టాక్ మార్కెట్ అప్రతిహాత పురోగమనానికి దేశ ఆర్థక ఫండమెంటల్స్ పటిష్టతే ప్రధాన కారణమని సామాన్యుడూ, చిన్న పెట్టుబడిదారుడు ఎంతో కొంత విశ్వసిస్తూ వచ్చాడు. అయితే ఇందుకు ప్రధాన కారణం విదేశీ సంస్థాగత పెట్టుబడులేనని స్పష్టంగా తేలిపోయింది.
నిజానికి దేశంలో ఆర్థిక ఫండమెంటల్స్ బాగుంటేనే విదేశీ పెట్టుబడులు వస్తాయి. అయితే ఇలాంటి పెట్టుబడుల విధానాన్ని నవీకరించాలని, పారదర్శకత తీసుకురావాలని సెక్యూరిటీస్ ఎక్స్ చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెవి) చేసిన ప్రయత్నం మార్కెట్ భారీ పతనానికి దారితీసింది.
వెంటనే కేంద్ర ఆర్థికమంత్రి పి. చిదంబరం విదేశీ పెట్టుబడిదారులు ప్రధానంగా పెట్టుబడులు పెట్టే పార్టిసిపేటరీ నోట్స్ (పిఎస్) ను రద్దుచేయాలన్న ఆలోచన లేదని స్పష్టమైన ప్రకటన చేయడంతో స్టాక్ మార్కెట్ పతనం ఆగింది. రెండునెలల క్రితమే ఇలాంటి ప్రకటనను సెబీ చేసి ఉంటే బాగుండేదని పరిశీలకులు అంటున్నారు. మార్కెట్ లోకి సక్రమరీతిలో విదేశీ పెట్టుబడులు వచ్చేలా ఇక ముందు చర్యలు తీసుకోవడం, తద్వారా నిజమైన మద్దతు ధర వద్ద మర్కెట్లను నిలపడం, ప్రభుత్వానికి, అలాగే మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి కీలకమైన అంశమనడంలో సందేహం లేదు.
|