|
నల్లగొండ, మహబూబ్ నగర్ లో ఐటి సిటీలు
హైదరాబాద్, అక్టోబర్ 24 ~: ఐ.టి. రంగంలో రానున్న ఏడాదిన్నర కాలంలో మూడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఐ.టి. శాఖ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి అన్నారు. ఉద్యోగాల కల్పనకు జరుగుతున్న క్రుషి వల్ల ఎగుమతులు పరోక్షంగ ఆయ రంగలు విస్త్రుతమవుతాయని ఆయన చెప్పారు. గత ఏడాది 18,582 కోట్ల మేర ఎగుమతులు జరిగాయని 52 శాతం మేర సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరిగాయని చెప్పారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు సమీపంలోని నల్లగొండ, మహబూబ్ నగర్ లలో ఐటి సిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఐ.టి. రంగంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నాలుగవస్థానంలో ఉందని, అతి త్వరలో రెండో స్థానానికి చేరుకుంటుందని చెప్పారు..
|