|
ఖనిజసంపద నిలయం..... నల్లమల
నల్లమల, అక్టోబర్ 29 ~: నల్లమల అటవీ ప్రాంతంలో అపారమైన వేలకోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉన్నట్లు గనుల శాఖ గుర్తించింది. దీంతో ఈ ప్రాంతం ఇప్పుడు బంగారుబాతుగా మారనున్నది. నల్లమల గర్భంలో బంగారం, వజ్రాలు, ప్లాటినం, రాగి, నికిల్ నిక్షేపాలు అపారంగా ఉన్నట్లు భూగర్భ గనులశాఖ నిర్దారించింది. ప్రకాశం జిల్లా పరిధిలోకి వచ్చే అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిపేందుకు ఐదు బహూళ జాతి కంపెనీలు ఈ పాటికే దరఖస్తులు సమర్పించినట్లు అధికారవర్ఙాలు వివరించాయి.
నక్సలైట్ల హీంసాత్మక సంఘటనలతో నల్లమల ప్రాంతంలో వెళ్లడానికి కంపెనీలు అయిష్టతతో ఉండేవి. కాని ఇప్పుడు ఈ ప్రాంతంలో వారి ప్రాబల్యం నామమాత్రంగా మారడంతో ఖనిజ నిక్షేపాల వెలికితీతకు బహూళ జాతి కంపెనీలు ముందుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రాగి, నికిల్ నిక్షేపాలకోసం ఆంగ్లో అమెరికన్ ఎక్స్ ప్లోరేషన్ ఇండియా ప్రివేట్ లిమిటెడ్, ప్లాటినంకోసం ఫెల్ ఫరిడ్ ఎక్స్ ఫ్లోరేషన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ, బంగారం, ప్లాటినంకోసం అడ్మాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దరఖాస్తు చేసుకున్నాయి. మరో రెండు కంపెనీలు కూడా దరఖాస్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులు అక్కడ నిధి నిక్షేపాలకోసం తవ్వకాలు జరిపి విజయవంతమైన నేపథ్యంలో నల్లమలపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తున్నది. నల్లమల అటవీప్రాంతంలోని చెంచులకు ఐటిడిఎ వెలుపలికి తీసుకువచ్చి పునరావాసం కల్పించడంతో అక్కడ వారి ప్రాబల్యం కూడా తగ్గిపోయింది. ఈ పరిస్థితులన్నీ బహుళజాతి కంపెనీలు కలిసివస్తున్నాయి. అందువల్ల ఎలగైనా సరే ఇక్కడ తవ్వకాలకు అవసరమైన అనుమతిని తీసుకునేందుకు ఆ కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
|