More
More Videos Advt...

మారిన ఇలియానా

తెలుగు చలనచిత్రరంగంలో ఇప్పుడు ఇలియానా హవా నడుస్తోంది. దేవదాసు చిత్రంతో ఒక్క ఊపు ఊపిన ఇలియానా తరువాత పోకిరితో మరో మెట్టు పైకి వెళ్లింది. దీంతో పాటు ఖరీదైన నటిగా గుర్తింపును తెచ్చుకుంది. బాలివుడ్ లో అవకాశాలు వచ్చినప్పటికి తెలుగు చిత్రాలపైనే ఆమె ద్రుష్టి అంతా ఉంది. ఇలియానా డిమాండ్ ను చూసి నిర్మాతలు కూడా ఆమెకు ఎంతయినా చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఒక చిత్రంలో నటించేందుకు ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు చెప్పారు.