More
More Videos Advt...

నటగాయని మమతా

విదేశాల్లో పెరిగినా మళయాలీ భామ మమతా మోహన్ దాస్ తెలుగు సినిమాల్లో ఈ రోజు ప్రముఖ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తొలుత మళయాళ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన మమతా తరువాత ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాల చిత్రాల్లో నటిస్తున్న మమతా మోహన్ దాస్ గాయిని కూడా. తెలుగులో ఆమె పాడిన పాటలు అందరినీ అలరించాయి. శంకర్ దాదా జిందాబాడ్ లో ఆకలేస్తే అన్నం పెడుతా, రాఖీ సినిమాలో రాఖీ రాఖీ పాట, యమదొంగ లో ఓలమ్మీ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. నటిగా, గాయనిగా పేరు తెచ్చుకున్న మమతా మోహన్ దాస్ ప్రస్తుతం బాలివుడ్ వైపు చూస్తున్నట్లు వార్త.