More
More Videos Advt...

బాలివుడ్ లో కత్రినా హవా!

సినిమాలు అంతా నమ్మకాలపై ఆధారపడి ఉండంటారు. ఇందులో నటించే హీరో, హీరోయిన్ లు తమ చిత్రాల్లో నటిస్తే లాభం వస్తుందని నిర్మాతలు నమ్ముతుంటారు. హీరోయిన్లను వారు గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్ అని రెండుగా విడదీస్తుంటారు. మొదట్లో ఐరన్ లెగ్ గా పేరు పొందిన వారు తరువాత గొల్డెన్ లెగ్ లు గా మారిన సందర్భాలు ఉన్నాయి. మొన్నటివరకు లక్కి హీరోయిన్ గా రాణీ ముఖర్జీని పేర్కొనేవారు. కరణ్ జోహార్ అయితే తన సినిమాల్లో రాణీ ముఖర్జిని అతిధి పాత్రల్లోనైనా నటించమని కోరేవాడు. పరిణీత సినిమాతో సినీరంగంలోకి వచ్చిన విద్యాబాలన్ కి కూడా లక్కీ హీరోయిన్ ముద్ర ఉంది. దాంతో ఆమె తమ సినిమాల్లో ఉంటే చాలు ఆ సినిమా హిట్ అవడం ఖాయమని బాలివుడ్ నిర్మాతలు నమ్మేవారు. తాజాగా ఇప్పుడు కత్రీనాకు ఈ లక్ వచ్చింది. ఇప్పుడు అంతా కత్రినా చుట్టూ తిరుగుతున్నారు. దీనికి తోడు గత సంవత్సరం ఆమె నటించిన చిత్రాలు విజయఢంకా మోగించడంతో ఇప్పుడు కత్రినాదే హవా అయింది.