More
More Videos Advt...

తమన్నా స్పీడ్!

టీనేజ్ బ్యూటి తమన్నా మొదటి సినిమా హ్యాపిడేస్ గ్రాండ్ సక్సెస్ తో ఆమె సుడి తిరిగినట్లయింది. అక్కినేని మనవడు సుశాంత్ సరసన కాళిదాసు సినిమాలో తాజాగా నటించింది. మరో మూడు సినిమాలు వరుసలో ఉన్నాయి. హ్యాపి డేస్ చిత్రాన్ని తమిళంలో రిమేక్ చేస్తున్న తమిళ నిర్మాతలు ముందు తమన్నాని ఒప్పుకున్నారట. తరువాత ఆ నిర్మాతలు వేరే తార కోసం వెతుకుతున్నారని తెలిసి తమన్న విషయం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. తాను అడిగిన పారితోషికం చూసి వారు వెనుదిరిగినట్లు తెలుసుకుని ఖంగు తిన్నదట. ఇక మీద అయినా తన జోరును తగ్గించుకుంటే బావుంటుందని పరిశీలకులు సలహాలు ఇస్తున్నారట.