More
More Videos Advt...

    మీరాజాస్మిన్ పై నిషేధం?

    తెలుగు, తమిళ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్ సంపాదించుకున్న మలయాళ హీరోయిన్ మీరా జాస్మిన్. ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమ మీరా జాస్మిన్ పై కోపంగా ఉంది. దీని వెనుక ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి. మలయాళ సినీ అసోసియేషన్ తన సభ్యులకోసం ఓ సినిమాను నిర్మిస్తున్నది. ఈ చిత్రంలో హీరోయిన్లందరూ ఉచితంగా నటించాలని మలయాళ సినిమా అసోసియేషన్ (ఎ.ఎమ్.ఎమ్.ఎ) నిర్ణయం తెసుకుంది. ఇందులో భాగంగా మీరాజాస్మిన్ ను కూడా నటించమని అడిగారు. అయితే తనకు డేట్స్ ఖాళీగా లేవని చెప్పిందట. దాంతో ఆగ్రహించిన మలయాళ సినీ పరిశ్రమ మీరాపై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నదట.