More
More Videos Advt...

దశావతారం ఆడియో లాంచింగ్ కు అతిరథ మహారథుల రాక

    కమలహాసన్ నటించిన "దశావతారం" చిత్రం ఆడియో లాంచింగ్ కు సినిమారంగానికి చెందిన అతిరథమహారథులంతా చెన్నైకి తరలి వస్తున్నారు. ఈ ఆడియో లాంచింగ్ శుక్రవారం జరగనున్నది. హాలివుడ్ యాక్షన్ హీరో జాకిచాన్, బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళం మెగాస్టార్ మమ్మూట్టి, హేమమాలిని, మల్లికా షెరావత్ లాంటి మేటి నటీ నటులు ఈ ఆడియో వేడుకకు హాజరు కానున్నట్లు తెలిసింది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, ప్రముఖ నటుడు విజయ్, హీరోయిన్ అసిన్ తదితరులు కూడా హాజరవుతున్నారు. కాగా ఈ సినిమాకు దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు వార్త. 18 నెలలపాటు ఈ చిత్రం షూటింగ్ జరిగింది.