|
దమ్ముంటే కె.సి.ఆర్ ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలి
- శ్రీనివాస్
ఉప ఎన్నికల ప్రచారాన్ని పి.సి.సి. అధ్యక్షుడు డి. శ్రీనివాస్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. పార్టీ ఓటమి పాలవడం ఖాయమని జోస్యం చెప్పారు. కె.సి.ఆర్ కి దమ్ముంటే ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలని
డి.ఎస్. సవాల్ విసిరారు. కె.సి.ఆర్ ప్రతిరోజు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం
తనకు లేదని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు ప్రభుత్వ పాలనకు రెపరెండం కావని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
|