More
More Videos Advt...

ఉప ఎన్నికల ఖర్చు 400 వందల కోట్లు!

తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చు దాదాపు 200 నుంచి 400 కోట్ల రూపాయల దాక ఉందవచ్చని అంచనా. నాలుగు లోక్ సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో లోక్ సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలను కలుపుకున్నట్లయితే మొత్తం 41 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నట్లు లెక్క.ఎన్నికల సంఘం నిబందన్ల ప్రకారం ఒక్కో అసెంబ్లీ స్థానానికి పది లక్షలు, ఒక్కో లోక్ సభ స్థానానికి 25 లక్షల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టాలి. దీని ప్రకారం అన్నీ స్థానాలకు పోటీ చేసే ఒక్కో పార్టీ మొత్తం రెండున్నర కోట్ల రుపాయల మేరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలు ఇటీవలి కాలంలో పెడుతున్న ఖర్చులను పరిశీలిస్తే మొత్తం రెండున్నర కోట్ల రూపాయలు ఒక్క అసెంబ్లీ నియోజక వర్గానికే సరిపోదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే కొంతమంది అభ్యర్థులు ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. ఒక్కో అసెంబ్లీ స్థానానికి 3 కోట్ల రూపాయల చొప్పున లెక్కగట్టిన మొత్తం 41 అసెంబ్లీ స్థానాలకు దాదాపుగా ఒక్కో పార్టీ 125 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఇలా ఖర్చు పెడితే మొత్తం ఖర్చు దాదాపు 400కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా.