|
ప్రచారవ్యూహంలో కాంగ్రెస్ బిజి
తెలంగాణ సెంటిమెంట్ ను ఆసరాగా తీసుకుని దూసుకు వెళుతున్న తెలుగుదేశం పార్టీని కట్టడి చేసి, 16 శాసనసభ, 4 లోక్ సభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలు గెలుచుకునే
రీతిలో వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకుంటోంది. పాత మిత్రులు వామపక్షాలు దూరం కావడం, టి.ఆర్.ఎస్.తో పాటు, బి.జె.పి. పార్టీ కూడా తెలంగాణం ఆలపిస్తుండటం,
తెలుగుదేశం పార్టీ కూడా సమైక్య వాదాన్ని పక్కన పెట్టి తెలంగాణ పాట పాడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరులో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్నది. తాము ప్రత్యేక
తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే అభివ్రుద్ధి పథకాలతో ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నది. ముఖ్యమంత్రి, పి.సి.సి. అధ్యక్షుడు వెర్వేరుగా ప్రచారం ప్రారంభించి
ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.16 నియోజకవర్గాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులను ఇన్ చార్జీలుగా నియమించారు. వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరించే సి.డి.లను రూపొందించారు.ముఖ్యమంత్రి వై.ఎస్. ఎన్నికల ప్రచారం, రోడ్ షో, రూట్ మ్యాప్ లను రూపొందిస్తున్నారు.
|