|
పార్టీ టిక్కెట్ వద్దు బాబోయ్!
టిక్కెట్టు కోసం పార్టీ కార్యాలయాల ముందు బలప్రదర్శనలు, టికెట్ ఇవ్వకపోతే సహించమనే హెచ్చరింపులు, బెదిరింపులు ఇలాంటి దృశ్యాలు ఎన్నికలనగానే మనకు కనిపించే
చిత్రాలు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదు. పార్ఠీ టికెట్ ఇస్తామన్నా మేము పోటీ చేయం బాబోయ్ అంటున్నారు. మరో ఏడాదిలోపే సాధారణ ఎన్నికలు జరగనుండటంతోపాటు, ఈ ఎన్నికల్లో విపరీతంగా
ఖర్చు చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని టికెట్ కోసం నాయకులు ఆసక్తి చూపడం లేదు. టి.డి.పి.లో ఇప్పటికే ఇలాంటి సంఘటనలు జరిగాయి.
|