|
64 కోట్లు పలికిన
రజనీకాంత్ సినిమా
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటిస్తున్న కుచేలన్ సినిమాను 64 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూషన్ రైట్లను పిరమిడ్ సాయిమీర సంస్థ తీసుకున్నట్లు తెలిసింది. ఈ సినిమా కోసం ప్రముఖ సంస్థలైన ఆడ్ ల్యాబ్స్, అయ్ గారన్ ఫిలిమ్స్, పిరమిడ్ సాయిమీర సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు పిరమిడ్ సాయిమీరకు ఈ రైట్స్ దక్కిందని తమిళ సినీవర్గాల మాట. ఈ సినిమా తెలుగులోను, తమిళంలోను ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శంకర్ మహాదేవన్, హరిహరన్ పాడిన పాటల రికార్డింగ్ పూర్తయింది.
|