|
సెంచరి దర్శకులు
క్రికెట్ లో వంద పరుగులు పూర్తి చేస్తే ఎంతో సందడి, నటుడిగా వంద చిత్రాలు పూర్తి చేస్తే అదో లక్ష్యం. అదే దర్శకుడిగా వంద చిత్రాలు తీయడం సాధ్యమా! అంటే ఒకప్పుడు కాదు.
కాని దాన్ని సాధ్యం చేసి చూపించారు అగ్ర దర్శకులు కె. బాలచందర్, దాసరి నారాయణ రావు. యావత్ ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఇది అరుదైన రికార్డు. మన భారత దేశంలో
ఇలాంటి అరుదైన రికార్డు ఐదుగురికి మాత్రమే ఉంది. తెలుగులో శతకం పూర్తి చేసిన తొలి దర్శకుడు దాసరి నారాయణ రావు కాగా, తమిళంలో కె. బాలచందర్ పేరు చెప్పవచ్చు. వీరిద్దరు
క్రియేటివ్ దర్శకులు.
|