|
డైరెక్షన్ చేస్తా - తబు
ఇటీవల తెలుగు తెరపై తీగలా తలుక్కుమన్న తబు ఈ మధ్య తన గురించి కొన్ని సంగతులను తెలియజెప్పింది. తను అందాలను విరజిమ్మేందుకు ప్రాముఖ్యత ఇవ్వనని, జీవం ఉన్న పాత్రలంటే తనకు ఇష్టమని చెప్పింది. అంతే కాక తాను ఇప్పుడు బాలక్రిష్ణ హీరోగా నటిస్తున్న పాండురంగ చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది.
ఈ చిత్రంలో నటించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పింది. కాగా తన చిరకాల వాంఛ సినిమాకు డైరెక్షన్ చేయాలన్నదే అని వెల్లడించింది.అయితె మరో అయిదేళ్ల తరువాత మాత్రమే తాను డైరెక్షన్ రంగంలో అడుగుపెడుతానని
చెప్పింది.
|