More
More Videos Advt...

తమిళ అమ్మాయిగా ఇషాడియోల్

బాలీవుడ్ భామ ఇషాడియోల్ ఇప్పుడు తమిళ అమ్మాయిగా కనిపించనున్నది. డ్రీమ్ గర్ల్ హేమమాలిని కూతురయిన ఇషాడియోల్ తమిళంలో కూడా బాగానే మాట్లాడుతుంది. కుమార్ మంగత్ నిర్మిస్తున్న 123 చిత్రంలో ఇషాడియోల్ తమిళ అమ్మాయిగా కనిపించనున్నది. ఈ చిత్రంలో తమిళియన్ కేఫ్ ఓనర్ గా ఆమె కనిపిస్తుంది. ఈ చిత్రానికి అశ్వినీధీర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతవరకు పూర్తిస్తాయి హాస్యరస పాత్రలో నటించడం ఇషాడియోల్ కు ఇదే ప్రథమం. గతంలో కూడా యువ చిత్రంలో ఇషాడియోల్ అయ్యంగార్ అమ్మాయిగా నటించిన సంగతి తెలిసిందే.