More
More Videos Advt...

ఇంట గెలుస్తా

ఇంట గెలిచి రచ్చ గెలవడం కంటే రచ్చ గెలిచి ఇంట గెలవడమే మంచిదని యువ హీరో విశాల్ నమ్మకం. తెలుగువాడైన విశాల్ తమిళ హీరోగా స్థానం సంపాదించుకున్నాడు. ఆయన నటించిన తమిళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించాయి. తెలుగులో కూడా హీరోగా నటిస్తూ తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో భాగంగా విశాల్ సెల్యూట్ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో మాస్ హీరోగా నిలదొక్కుకున్న విశాల్ తెలుగులో కూడా అదే స్థాయిలో విజయాన్ని సాధించే ప్రయత్నంలో ఉన్నాడు.