|
తెలుగు పలుకులకోసం
తమన్న ఆరాటం
హ్యాపిడేస్ చిత్రంతో అందరి మనస్సులను చూరగొన్న హీరోయిన్ తమన్న ఇప్పుడు కాళిదాసు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో హీరోగా నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా
నటిస్తున్నాడు. సుశాంత్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. తాజాగా అల్లు అర్జున్ సరసన నటిస్తోంది. తెలుగులో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పాలని
తమన్న భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా తెలుగు భాషను నేర్చుకోవడం మొదలు పెట్టింది. తమన్నా పలుకులను వినాలంటే కాళిదాసు చిత్రం చూడాల్సిందే.
|