|
పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన నవ్య నాయర్
మలబార్ అందగత్తె, హీరోయిన్ నవ్యా నాయర్ బిల్డర్ పై పొలీస్ కేసు పెట్టింది. కోచిలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్న అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ ను నవ్య నాయర్ తీసుకోవాలని
భావించింది. ఇందుకు అనుగుణంగా ఆ బిల్డర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్సుగా 9 లక్షల రూపాయలను చెల్లించింది. కాని చివరకు తాను తీసుకోనున్న ఫ్లాట్ కు
కార్పొరేషన్ అనుమతి లేదని తెలిసింది. దీంతో ఆగ్రహించిన నవ్య ఆ బిల్డర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
|