More
More Videos Advt...

చలాకీ తగ్గని సిమ్రాన్

బాలివుడ్ నుంచి వచ్చిన తారల్లో సిమ్రాన్ కు ప్రేక్షకుల్లో మంచి ఇమేజే ఉంది. వివాహం అయిన తరువాత కూడా సిమ్రాన్ సినిమాలకు గుడ్ బై చెప్పక నటిస్తున్న సంగతి తెలిసిందే. వివాహం అయిన తరువాత ఆమె నటించిన తెలుగు చిత్రం జాన్ అప్పారావు పార్టీ ప్లస్. ఈ సినిమా చూసినవారంతా సిమ్రాన్ లో ఇంకా చలాకీతనం తగ్గలేదని అంటారు. ఇప్పుడు ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. కాని సిమ్రాన్ లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఉన్నట్లుండి లావుగా కనిపిస్తుంది. కొద్దిరోజుల తరువాత సన్నగా కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న రహస్యమేమిటని అడిగితే ఇంట్లో ఉంటే మనిష్టం వచ్చినట్లు ఉండవచ్చు. కాని సినిమాల్లో నటించాలంటే సన్నబడాలి కదా అని అంటుంది.