|
కుచేలన్ లో కమలహాసన్
తమిళ సినీరంగంలో ప్రముఖ నటులుగా పేరుపొందిన సూపర్ స్టార్ రజనీకాంత్, కమలహాసన్ ఇప్పుడు ఒక చిత్రంలో కలిసి కనిపించనున్నారు. తమిళనాడులో ఇద్దరికి అశేష సంఖ్యలో
అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న "కుచేలన్" చిత్రంలో కమలహాసన్ కూడా కనిపించనున్నాడు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నటులు రజనీకాంత్, కమలహాసన్ ను బాలచందరే సినిమారంగానికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సినిమా రంగానికి పరిచయమైన తొలినాళ్ళలో వీరిద్దరూ కలిసి నటించారు. చాలాకాలం తరువాత మళ్లీ ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు.
|