More
More Videos Advt...

ఐదుగురు హీరోయిన్లతో రజనీ ఆటాపాట

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కుచేలన్ చిత్రంపై అప్పుడే క్రేజ్ పెరిగింది. దీనికి తోడు ఈ చిత్రంలొ అయిదుగురు హీరోయిన్లతో రజనీ ఓ పాటలో కనిపించనున్నారన్న వార్త అభిమానులను మరింతగా ఆకర్షిస్తోంది.నయనతార, మమత మోహన్ దాస్, మీన, నమిత, స్నేహలతో రజనీకాంత్ ఓ పాటలో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నట్లు వార్త. దీంతో పాటు పలువురు హీరోలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తారని అంటున్నారు. అగ్రశ్రేణి నటుడు కమలహాసన్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించనున్నారు. తెలుగులో కూడా నిర్మిస్తున్న కుచేలన్ చిత్రంలో రజనీకాంత్ తో పాటు జగపతి బాబు నటిస్తున్నాడు. తమిళంలో జగపతి బాబు పాత్రను ప్రభు పోషిస్తున్నాడు.