|
ఐటెం సాంగ్ కి పదిలక్షలు !
ఇప్పుడు ఐటెం సాంగ్ లో నటించే వారికి మంచి డిమాండ్ కనిపిస్తోంది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ సమర్పణలో వస్తున్న సినిమాలో చార్మి ఓ ఐటెం సాంగ్ లో నటిస్తోందట. ఈ సాంగ్ లో నటించేందుకు చార్మీ తొలుత
20 లక్షలు డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయి. కాని తాజాగా తెలిసిన విషయమేమిటంటే ఒక్క సాంగ్ కోసం ఆమెకు 10 లక్షల రూపాయలు ఇస్త్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో తరుణ్, ఇలియానా నటిస్తున్నారు.
|