|
తిరుపతిలో గంగమ్మ జాతర ప్రారంభం
తిరుపతి గంగమ్మ దేవత జాతర ఈరోజు ప్రారంభమైంది. రాయలసీమలో అతి వైభవంగా జరిగే
ఈ జాతర నాలుగురోజులపాటు సాగుతుంది. లక్షలాదిమంది భక్తులు ఏటా ఈ జాతరకు తరలి వస్తుంటారు. జాతర సందర్భంగా అమ్మవారికి వైభవంగా అభిషేకం జరిగింది.
భక్తులు ఆలయ ప్రాంగణంలోనే పొంగళ్లను వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
|