More
More Videos Advt...

దేవేందర ఒక బోడి లింగం - కె.సి.ఆర్

తెలుగుదేశం సీనియర్ నాయకుడు దేవెందర్ గౌడ్ పై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేవెందర్ శతకోటి లింగాల్లో బోడి లింగం. కరీంనగర్ ఉప ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. తెలంగాణ గురించి దేవెందర్ గౌడ్ కు ఏమి తెలియదని విమర్శించారు. ఉప ఎన్నికల గండం నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు తెలంగాణ జపం చేస్తున్నాయి. కాని ప్రజలు నమ్మరని తమ పార్టీనే గెలిపించడం ఖాయమని ఆయన ధీమాగా అన్నారు. మమ్మల్ని ఎలాగైనా ఓడించాలని ఆ పార్టీలు కలిసికట్టుగా యత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.