|
రాజ్యసభలో మహిళాబిల్లు
ఎంతో కాలంగా అందరూ ఎదురుచూస్తున్న మహిళాబిల్లును ఈరోజు రాజ్యసభలో కేంద్రన్యాయ శాఖ
మంత్రి భరధ్వాజ్ ప్రవేశపెట్టారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లు
ఎప్పుడో పార్లమెంట్ ముందు రావలసి ఉంది. ఈ బిల్లు ప్రవేశపెట్టె సమయంలో రాజ్యసభలో గందరగోళ
పరిస్థితులు నెలకొని ఉంది. రాజ్ థాకరే వ్యాఖ్యలను నిరసిస్తూ సమాజ్ వాది పార్టీ సభ్యులు
అరుపులకు,దూషణలకు దిగడంతో సభ వాయిదా పడింది.
|