More
More Videos Advt...

షో వద్దు...సత్తా చూపంది

ఉపేన్నికల సందడి మొదలైనా కరీంనగర్, నిజామాబాద్ జిల్లలోని కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేత ఎమ్.ఎస్.ఆర్ వయసు మీద పడినా ఎంత చురుకుగా పనిచేస్తునారో చూడంది. పార్టీ కోసం శ్రమిస్తారని మీకు పదవులు కట్టబెడితే మీరు చేస్తున్నదేమిటీ? ఇలా అయితే లాభం లేదు. నాకు షో వద్దు.. షో చేసే లీడర్స్ వద్దు. నేను వచ్చినప్పుడు ప్లెక్సి బోర్డులు ఏర్పాటు చేయడం, కరపత్రాలు పంచడం కాదు. జనం వద్దకు వెళ్లండి. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించండి.ఓట్లు వేసేలా పనిచేయంది. లేకపోతే సహించేది లేదని ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి జిల్లాల నాయకులపై విరుచుకు పడ్డారు.